బ్రెజిల్లో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా 90,570 కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1,18,71,390కు చేరింది.
కొత్తగా 2,815 మంది మరణించారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షల 90 వేల 525కు చేరింది. వైరస్ కేసులు ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1 కోటీ 3 లక్షల మందికి పైగా కోలుకున్నారు.