దేశీయ కరోనా టీకా కొవాగ్జిన్‌ను (WHO covaxin news) అత్యవసర వినియోగ జాబితాలో (ఈయూఎల్) చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మరింత సమయం తీసుకునే అవకాశముంది(covaxin WHO approval). కనీసం రెండు వారాల సమయం పట్టొచ్చని డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన ఓ అధికారి తెలిపారు.
"వ్యాక్సిన్ ఈయూఎల్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ఇచ్చిన అనుమతులను ప్రపంచ దేశాలన్నీ పాటించాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో అంతర్జాతీయంగా గుర్తింపును ఇవ్వాలంటే డబ్ల్యూహెచ్‌ఓ అన్నింటినీ పరిగణనలోకి తీసుకువాలి. ఒక్కటి, రెండు వారాల సమయం పట్టినా, ప్రపంచానికి సరైనదాన్ని అందివ్వాలి. అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, అత్యున్నత నాణ్యత కలిగిన టీకాను రూపొందించామని ప్రపంచానికి తెలియాలి. "
-- డా. మైక్ ర్యాన్, డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌ను (covaxin WHO approval status) ఈయూఎల్‌లో చేర్చడంపై ఈ నెల 26న డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన సాంకేతిక సలహాదారు బృందం చర్చించనున్నట్టు సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అయితే కొవాగ్జిన్‌కు అనుమతులిచ్చే ముందు తమకు ఇంకొంత సమాచారం కావాలాని డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం అభిప్రాయపడింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తాము అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్ టీకాకు సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓకు (WHO on Covaxin) ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది. "మా నిపుణులు కోరుతున్న సమాచారాన్ని భారత్ బయోటెక్ అందజేస్తూ వస్తోంది. దానిని విశ్లేషిస్తూ అవసరమైన వివరాలు కోరుతున్నాం. ఇప్పుడు అదనంగా మరొక్క సమాచారం రావాల్సి ఉంది" అని డబ్ల్యూహెచ్‌ఓ ఆ ట్వీట్‌లో పేర్కొంది.
ఇదీ చూడండి:-'కరోనా మహమ్మారికి ముకుతాడు.. భారత్ భేష్!'