తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆశ్చర్యం.. 'కరోనా' గ్రామాల్లో ట్రంప్​కు భారీ మద్దతు!

కరోనా మహమ్మారిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందనకు భిన్నంగా ఓటర్లు ఆయనకు మద్దతు తెలిపారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రంప్​కు 93 శాతం ఓట్లు పడ్డాయని అమెరికన్ వార్తా సంస్థ సర్వేలో తేలింది.

US-ELECTION-TRUMP
డొనాల్డ్ ట్రంప్

By

Published : Nov 6, 2020, 7:44 AM IST

Updated : Nov 6, 2020, 9:31 AM IST

కరోనా వైరస్​పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి విషయంలో ఓటర్లు అనూహ్యంగా ప్రవర్తించారు. అమెరికాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రంప్​కు భారీ మద్దతు లభించటం ఆశ్చర్యకరం.

తలసరి కొత్త కేసులు అత్యధికంగా ఉన్న 376 కౌంటీలలో 93 శాతం ఓట్లు ట్రంప్​కే పడ్డాయని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) విశ్లేషించింది. వీటిలో చాలా వరకు డకోటా, మోంటానా, నెబ్రాస్కా, విస్కాన్సిన్​, అయోవాలోని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.

వివిధ ప్రాంతాల్లో ఏపీ చేసిన సర్వేలో.. ట్రంప్ ఓటర్లలో 36 శాతం మంది కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. మరో 47 శాతం మంది తటస్థంగా ఉందన్నారు. బైడెన్ ఓటర్లలో మాత్రం 82 శాతం మంది వైరస్​ నియంత్రణలోకి రాలేదన్నారు.

ఇదీ చూడండి:అమెరికాలో కరోనా వైరస్​ కొత్త రికార్డులు

Last Updated : Nov 6, 2020, 9:31 AM IST

ABOUT THE AUTHOR

...view details