మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్95, సర్జికల్ మాస్కులు కొరత ఏర్పడింది. దీంతో ప్రజలే సొంతంగా మాస్కులు తయారు చేసుకొని ఉపయోగించుకుంటున్నారు. వీటిపై అధ్యయనం చేసిన పరిశోధకులు కాటన్, సహజ శిల్క్ లేదా షిఫాన్తో కలిపి తయారు చేసిన మాస్కులు గాలితుంపరలను బాగా అడ్డుకుంటాయని తేల్చారు. వైరస్ నుంచి రక్షిస్తాయని వెల్లడించారు.
అనుమానంతో పరిశోధన..
ఏరోసోల్స్ అని పిలిచే సూక్ష్మరూపంలో ఉండే తుంపరులు తెరిచి ఉన్న కొన్ని వస్త్రాల ఖాళీల మధ్య నుంచి సులభంగా జారిపోతాయి. ఇదే విషయం కొంతమంది నిపుణుల్లో వస్త్ర మాస్కులు వ్యాధిని నివారించడంలో సహాయపడతాయా? అనే సందేహానికి దారితీసింది. దీంతో అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఏసీఎస్ నానో జర్నర్లో ప్రచురించారు. సాధారణ దస్తులు సూక్ష్మ పరిమాణంలో ఉన్న గాలి తుంపర్లను వడపోయగలవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కణాలు ప్రవేశించే రేటు ఆధారంగా..