కరోనా వ్యాక్సిన్ సమర్థవంతమని తేలితే అమెరికా ప్రజలకు ఉచితంగానే సరఫరా చేస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు. ప్రజా సంక్షేమం విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
అయితే టీకా సత్వర తయారీకి రెగ్యులేటరీ నిబంధనలను మేం సడలించడం లేదని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి పాల్ మ్యాంగో పేర్కొన్నారు. టీకాను తప్పక పరీక్షించి సామర్థ్యాన్ని అంచనా వేస్తామని తెలిపారు.
టీకా ప్రాజెక్టులపై అమెరికా ఇప్పటికే 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. కోట్ల కొద్దీ డోసులు అందజేసేలా పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. క్లినికల్ ట్రయల్స్ తర్వాత వీటిని అందించేలా అంగీకారానికి వచ్చాయి.
ఇతర ఖర్చులూ బీమాలోకి