తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​లోని అమెరికన్లను తరలించేందుకు ఏర్పాట్లు - coronavirus in america

లాక్​డౌన్​ కారణంగా భారత్​లో చిక్కుకున్న అమెరికన్లను తరలించే ఏర్పాట్లు చేస్తోంది అమెరికా. ప్రత్యేక విమానాల సాయంతో దాదాపు 2000 మందిని స్వదేశానికి చేర్చేందుకు యత్నిస్తోంది.

Coronavirus: US to airlift citizens stranded in India
భారత్​లోని అమెరికన్లను తరలించేందుకు ఏర్పాట్లు

By

Published : Mar 28, 2020, 4:27 PM IST

భారత్​లో చిక్కుకున్న దాదాపు 2వేల మంది అమెరికా పౌరులను విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు సిద్ధమైంది యూఎస్​ ప్రభుత్వం.

భారత్​లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. అంతర్జాతీయ రాకపోకలు నిలిపివేసింది. దీంతో భారత్​లో వేలాది మంది విదేశీ పర్యటకులు హోటల్​ గదులకే పరిమితమయ్యారు. ఇందులో దాదాపు 2వేల మంది అమెరికన్లూ ఉన్నారు.

దాదాపు 1500 మంది అమెరికన్లు దిల్లీలో, 700 మంది ముంబయిలో చిక్కుకున్నారు. 4 వందలకు పైగా అమెరికా వాసులు ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయారని ప్రకటించింది అమెరికా దౌత్య కార్యాలయం. అందుకే వారిని, ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

"మేము ఇక్కడున్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం. ఓ చర్చ్​ బృందం భారీ విమానాన్ని సమకూర్చింది. మేము ఆ విమానానికి అవసరమైన అనుమతులను తీసుకునే పనిలో ఉన్నాం. వారు 150కి పైగా అమెరికన్లను తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. పౌరులను భారతదేశం నుంచి నేరుగా అమెరికాకు చేరవేసేలా అమెరికా విమానయాన సేవలనే కాకుండా, విదేశీ విమానయాన సంస్థలనూ సంప్రదిస్తున్నాం. మేము ఇక్కడి వారిని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, ఇరు దేశాల అనుమతి పెద్ద సవాలుగా మారింది. "

-ఐయాన్​ బ్రౌన్లీ, దౌత్యకార్యాలయ సహకార కార్యదర్శి

ప్రపంచ వ్యాప్తంగా లాక్​డౌన్​ కారణంగా అమెరికాకు చెందిన 33 వేల మంది విదేశాల్లో చిక్కుకున్నారని తెలిపారు బ్రౌన్లీ.

ఇదీ చదవండి:దత్తత తీసుకున్నారు.. హోటల్​లోనే చిక్కుకుపోయారు!

ABOUT THE AUTHOR

...view details