కరోనా వైరస్ నిర్మాణంలో ప్రత్యేక లక్షణాలున్నట్లు గుర్తించారు పరిశోధకులు. మనుషుల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటానికి ఇదొక కారణమవ్వచని భావిస్తున్నారు. వ్యాధి కోసం కొత్త మందులను తయారుచేసేందుకు ఈ అధ్యయనం ఫలితం ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ బయోలాజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది. కణాల్లోకి ప్రవేశించేందుకు వీలు కల్పించే సార్స్-సీఓవీ2 స్పైక్ ప్రోటీన్లలో స్ట్రక్చరల్ లూప్‌ను గుర్తించినట్టు అమెరికాలోని కార్న్వెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఈ లూప్‌లో నాలుగు అమినో యాసిడ్ల సీక్వెన్స్ ఉందని.. ఇవన్నీ ప్రోటీన్‌ను నిర్మించాయని వెల్లడించారు. అందుకే ఈ వైరస్.. ఇతర కరోనా వైరస్‌లకు భిన్నంగా ఉందని వివరించారు.