భారత్లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా పోరులో భారత్కు సాయం చేయడానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు.
"భారత్లో పరిస్థితులు కచ్చితంగా విషాదకరమైనవి. కరోనా వల్ల చాలా మంది చనిపోతున్నారు. మేము ఇంతకు ముందు చెప్పాం, ఇప్పుడు చెబుతున్నాం.. భారత్కు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంటుంది. పీపీఈ కిట్లకు తదితరాలకు అమెరికా ఇప్పటికే సాయం చేసింది."