తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇకపై వారానికి నాలుగు రోజులే పని!

అమెరికాలోని చాలా కంపెనీలు పనివేళలు తగ్గించి, తమ సిబ్బందితో వారానికి నాలుగు రోజులే పని చేయించాలని యోచిస్తున్నాయి. ఈ విషయంలో న్యూజిలాండ్​ను ఆదర్శంగా తీసుకున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ నాలుగు రోజుల సూత్రాన్ని అమలు చేస్తున్నాయి.

Coronavirus pandemic open doors for 4-day workweek in US
వారానికి నాలుగు రోజులు పని.. రెండు రోజులు వీకెండ్​!

By

Published : May 25, 2020, 5:41 PM IST

వారాంతపు సెలవు కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. సెలవు ఒక్కరోజే అయినప్పటికీ.. తెగ సంబర పడిపోతారు. అలాంటిది.. ఇక నుంచి వారానికి నాలుగు రోజులే పని చేయాల్సి వస్తుందన్న తీపి కబురు వింటే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం అమెరికాలో ఇదే పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యంలోని పలు కంపెనీలు.. పని గంటలు తగ్గించి, వారానికి కేవలం నాలుగు రోజులే పని కల్పించాలనే యోచనలో ఉన్నాయట.

న్యూజిలాండ్​ ప్రేరణగా..

50రోజుల్లో కరోనా వ్యాప్తిని తగ్గించిన అనంతరం పరిశ్రమలను పునరుద్ధరించడానికి, ఉత్పాదకత పెంచడానికి, ఉద్యోగులకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి... వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నారు న్యూజిలాండ్​ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్​​.

"నాలుగు రోజులు పని చేయడానికే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అయితే అంతిమ నిర్ణయం ఉద్యోగులు, యజమానులు చేతులో ఉంటుంది. ఉద్యోగులు... యజమాని స్థానంలో ఉండి ఆలోచించి పని చేయాలి."

-జెసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్​ ప్రధాని​

ఇదే మార్గంలో ప్రపంచంలోని పలు దేశాలు పయనిస్తున్నాయి. గతవారం ఒక ఫేస్​బుక్ వీడియోలో వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయాన్ని నివేదించింది.

విజయవంతంగా..

నాలుగు రోజులు పని విధానాన్ని అమలు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు ఫిన్​లాండ్​​ ప్రధాని. ఈ విధానానికి బ్రిటన్​లోని లెబర్​ పార్టీ కూడా మద్దతిస్తున్నట్టు సమాచారం. జపాన్​లోని మైక్రోసాఫ్ట్​, అమెరికాలోని షాక్​-షాక్​ కంపెనీలు ఈ విధానం అమలు చేసి ఇప్పటికే విజయవంతమయ్యాయి.

ఆ సర్వే తెలిపింది!

64శాతం వ్యాపారవేత్తలు ఈ విధానం వల్ల వారి ఉత్పాదకత పెంచుకున్నట్లు బ్రిటన్​కు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో తెలిసింది. 77శాతం శ్రామికులు ఉత్తమమైన జీవితాన్ని గడిపినట్లు నివేదించింది. ఈ విధానంలో ఎదురయ్యే సమస్యల గురించి తెలిపింది. 2030 వరకు షిప్ట్​ల పని విధానంలో పెద్ద మార్పు జరగవని... కరోనా వైరస్​ ముందు.. బ్రిటన్​కు చెందిన కరెన్​ జాన్సన్ అనే పరిశోధకుడు అంచనా వేశారు. అయితే వైరస్​ వల్ల ఈ అంచనా తారుమారయినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'వ్యాపారాలపై ట్రంప్ సర్కారు రాజకీయం చేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details