దోమల ద్వారా కూడా కరోనా సోకుతుందా?... చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం చెప్పారు అమెరికా పరిశోధకులు. దోమల వల్ల వైరస్ సోకదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సైంటిఫిక్ రిపోర్ట్స్ మ్యాగజైన్లో ప్రచురించారు.
"దోమలు వైరస్ను వ్యాప్తి చేయలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ సిద్దాంతం నిజమని చెప్పే నివేదికను మొట్టమొదటి సారిగా మేం అందిస్తున్నాం."