కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది కేంద్రం. ఈ క్రమంలోనే దౌత్యవేత్తలు, ఉపాధి కోసం వెళ్లేవారు మినహా మిగిలినవారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణ నిబంధనల సమాచారం కోసం అమెరికాలో 24 గంటల హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం.
వాషింగ్టన్ డీసీలోని దౌత్యకార్యాలయం, హ్యూస్టన్, న్యూయార్క్, చికాగో, శాన్ఫ్రాన్సిస్కోల్లోని రాయబార కార్యాలయాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. బెర్ముడా, డెలావేర్, కొలంబియా, కెంటుకీ, మేరీల్యాండ్, నార్త్ కరోలినా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలవారు 202-213-1364, 202-262-0375 నంబర్లను సంప్రదించవచ్చు లేదా cons4.washington@mea.gov.inకు మెయిల్ చేయవచ్చు.