దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న కరోనా రోగుల్లో మరణాలు రేటు 12 రెట్లు అధికంగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. హృద్రోగ సమస్యలు, మధుమేహం, ఊపరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలిపింది.
జనవరి 22 నుంచి మే 31 వరకు 1.3 మిలియన్ కొవిడ్ బాధితులపై చేసిన పరిశోధన ఆధారంగా సీడీసీ ఈ నివేదిక రూపొందించింది. రోగుల్లో 33 శాతం మందికి హృద్రోగ సమస్యలు, 30 శాతం మందికి మధుమేహం, 18 శాతం మందికి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.