అమెరికాలో కరోనా పంజా- అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు
కొవిడ్ మహమ్మారి రూపం మార్చుకుంటూ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల వ్యాప్తితో మళ్లీ కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 1.64 లక్షల కేసులు వెలుగు చూశాయి. చైనాలో డెల్టా రకం వ్యాప్తితో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి అక్కడి స్థానిక ప్రభుత్వాలు. బ్రిటన్‌లోని కరోనా పంజా విసురుతోంది.
కరోనా కేసులు
By
Published : Sep 16, 2021, 8:43 AM IST
|
Updated : Sep 16, 2021, 9:19 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా(coronavirus world cases ) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 5,62,484 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 10,200 మంది చనిపోయారు(coronavirus world cases and deaths). అమెరికాలో గత రెండు రోజులుగా సగటున 1.50 లక్షలకుపైగా(America covid cases) కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 1,64,509 మందికి వైరస్ సోకింది. మరో 2,282 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు
దీంతో బైడెన్ సర్కారు కఠిన ఆంక్షలు విధిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికుల నియంత్రణకు కొత్త నిబంధనలను అమలు చేసింది. ఇటీవల 14 రోజుల్లో చైనా, భారత్, ఐరోపా దేశాలకు.. ముఖ్యంగా బ్రిటన్ సందర్శుకులపై నిషేధించింది. అలాగే అమెరికా వెళ్లే ఇతర విదేశీయులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. ఇటీవల దేశానికి వచ్చినవారు ఎవరైనా.. కరోనా బారినపడే అవకాశం ఉన్నట్లయితే వారిని అనుసరించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు శ్వాతసౌధం కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త జెఫ్రీ జియాంట్స్ తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కరోనాపై పరిశోధనకు భారీగా బడ్జెట్!
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌పై పరిశోధన జరిపేందుకు 470 మిలియన్ డాలర్లు వ్యయం చేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా 40,000 మంది వయోజనులు, పిల్లలపై పరిశోధన చేసేందుకు న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి మంజూరు చేసినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బుధవారం తెలిపింది. అలాగే ఇందులో 30కిపైగా అమెరికా సంస్థలు పాల్గొన్నారు.
చైనాలో లాక్డౌన్
చైనాలో కరోనా వైరస్ కేసులు(China covidcases) అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు తూర్పు తీరం వెంబడి రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించడం సహా పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేస్తోంది. ఫుజియాన్ ప్రావిన్స్‌లోని పుటియన్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచింది. ఈ క్రమంలోనే కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాలను అధికారులు పూర్తిగా మూసివేశారు. పుటియన్ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ బుధవారం తెలిపింది.