తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్క మీటరు దూరం పాటించినా కరోనా సోకుతుంది! - Case of coronavirus in india

కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఒక్క మీటరు సామాజిక దూరం కచ్చితంగా పాటిస్తున్నారా? అయితే, అదంతా వృథా ప్రయాసే అని అమెరికా జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం చెబుతోంది. అవును, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సామాజిక దూరం పాటించినా వైరస్​ వ్యాపించే అవకాశాలున్నయంటున్నారు పరిశోధకులు. మరి ఎంతదూరం ఉంటే కరోనా సోకదో తెలుసుకోండి.

Coronavirus can travel up to 8 metres from exhalation, linger in air for hours, MIT scientist says
ఒక్క మీటరు దూరం పాటించినా కరోనా సోకుతుంది!

By

Published : Apr 2, 2020, 7:02 AM IST

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు మూడు అడుగుల(1 మీటరు) సామాజిక దూరాన్ని తప్పకుండా పాటిస్తున్నారు ప్రజలు. అయితే ఒక్కమీటరు దూరం పాటించినంత మాత్రాన వైరస్​ విస్తరణకు అడ్డుకట్టవేయలేమంటోంది ఓ అధ్యయనం.

దూరం సరిపోదు..

మద్రాస్ ఇనిస్టిట్యూట్​ ఆప్​ టెక్నాలజీ అసోసియెట్​ ప్రొఫెసర్​ లిదియా బౌరోయిబా నిర్వహించిన ఓ అధ్యయనం అమెరికా వైద్య సంఘం జర్నల్​లో ప్రచురితమైంది. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) , అమెరికా వ్యాధి నియంత్రణ-నిరోధక కేంద్రం(సీడీసీ)లు 1930 నాటి కాలం చెల్లిపోయిన ప్రమాణాల ప్రకారం సామాజిక దూరాన్ని నిర్ధేశించాయని తేలింది. ఈ దూరం పాటిస్తే కరోనాను కట్టడి చేయడం అసంభవమని పేర్కొంది.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి గుప్పున ప్రయాణిస్తుంది. తుంపర్లలోని వైరస్​ ఎంత బరువుతో ఉన్నా 23నుంచి 27 అడుగుల దూరం వరకు ప్రయాణించగలదు, వ్యాధికారకాలు 8మీటర్లు వ్యాపిస్తాయని బౌరోయిబా తెలిపారు.

అందుకే కరోనా సోకిన వ్యక్తి ఒక్కసారి దగ్గినా, తుమ్మినా ఆ వైరస్​ దాదాపు 7-8 మీటర్ల దూరం గాల్లో ప్రయాణిస్తుందన్నారు. అందువల్ల ఒక్క మీటరు దూరం పాటించడం వల్ల కొవిడ్​-19 సోకకుండా ఆపలేమని స్పష్టం చేశారు.

"తుంపర్లలో ఉండే తేమ, వెచ్చదనం వల్ల వైరస్​ గాల్లో త్వరగా ఆవిరి అవ్వదు. ఈ సమయంలో వైరస్​ జీవిత కాలం వెయ్యి రెట్లు పెరుగుతుంది. ఒక్క మిల్లీ సెకను నుంచి దాని జీవ ప్రమాణం కొన్ని నిమిషాలకు పెరిగిపోతుంది. అందుకే ప్రస్తుతం నియంత్రణ విధానాలు అమలు చేస్తున్నప్పటికీ.. కొవిడ్​-19 వేగవంతమైన వ్యాప్తిని అరికట్టలేకపోతున్నాం."

-లిదియా బౌరోయిబా, పరిశోధకులు

ఇదీ చదవండి:'తిండి లేదు... బీర్లతోనే సరిపెట్టుకుంటున్నాం సార్'

ABOUT THE AUTHOR

...view details