కరోనా వైరస్ ముప్పు మానవులకే పరిమితం కాదని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న అనేక వానర జాతులకూ ఈ మహమ్మారితో ప్రమాదం ఉందని తేల్చారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీవజాతులపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే అంశంపై పరిశోధన చేపట్టారు. మానవుల కణజాలాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్ ఏసీఈ2 గ్రాహక ప్రోటీన్ వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వివిధ జీవ జాతుల్లో ఈ ప్రోటీన్ నిర్మాణ తీరును పరిశీలించడానికి జన్యు విశ్లేషణ చేపట్టారు. ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లోని పైపూత సహా అనేక కణాలు, కణజాలాల్లో ఈ ప్రోటీన్ ఉంటుంది.