19 వేలకు చేరువలో కరోనా మృతుల సంఖ్య - కరోనా వైరస్ అమెరికా
ప్రాణాంతక మహమ్మారి కరోనాతో ప్రపంచం గడగడలాడుతోంది. వైరస్ కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 19వేలకు చేరువలో ఉంది.
19వేల చేరువలో కరోనా మృతుల సంఖ్య
By
Published : Mar 25, 2020, 11:14 AM IST
|
Updated : Mar 25, 2020, 3:49 PM IST
కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 19వేలకు చేరువలో ఉండటం.. ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది.
ప్రాణాంతక మహమ్మారితో ఇప్పటివరకు 18వేల 907మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 4 లక్షల 22వేల 959మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం 1,09,143 మంది మహమ్మారిని జయించారు.
వైరస్ కేంద్రబిందువు చైనాలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ కరోనా వ్యాపిస్తోంది. తాజాగా 58మందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.