రోజురోజుకూ తన ప్రభావాన్ని ఉద్ధృతంచేస్తూ.. కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 42 లక్షలకు చేరువైంది. 2.83 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 14 లక్షల 90 వేల మంది ఈ వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
అమెరికాలో..
అగ్రరాజ్యం అమెరికాను కరోనా కుదిపేస్తోంది. కొత్తగా 18,600 మందికి కరోనా సోకగా.. కేసుల సంఖ్య 13,67,638కి చేరింది. ప్రపంచంలోనే అత్యధికంగా.. అమెరికాలో 80 వేల మందికిపైగా మరణించారు. 2,56,336 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తోన్న క్రమంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
రష్యాలో..
రష్యాలోనూ కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్కరోజే 11 వేల మంది వైరస్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 2.10 లక్షలకు చేరువలో ఉంది. రష్యాలో మొత్తం 1,915 మంది మరణించారు.
బ్రిటన్‌లో..