అగ్రరాజ్యమైన అమెరికాపై కరోనా మహమ్మారి.. విలయతాండవం కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొవిడ్-19 మొత్తం కేసుల్లో యూఎస్‌దే సింహభాగం. అంతేకాదు అక్కడ రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇవాళ కూడా 10వేలకు పైగా నూతన కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13లక్షలు దాటింది.
అమెరికాలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు 13 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 77 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో 13 లక్షలు దాటిన కరోనా బాధితులు
యూఎస్‌లో కరోనా వివరాలు..
రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అమెరికన్లతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్ సైతం రోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటానని తాజాగా ప్రకటించారు.
Last Updated : May 9, 2020, 8:43 AM IST