తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 8:12 PM IST

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 4లక్షలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 66లక్షల 7వేల మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 4లక్షలకు చేరువైంది. సుమారు 32లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

Corona update
ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వివిధ దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 66,07,000మందికి కరోనా సోకింది. మృతుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. అయితే కొవిడ్​-19 నుంచి సుమారు 32లక్షల మంది కోలుకున్నారు.

అమెరికాలో కొత్తగా 2,085 పాజిటివ్​ కేసులు నిర్ధరణకాగా, మొత్తం కేసుల సంఖ్య 19లక్షలకుపైగా పెరిగింది. మృతుల సంఖ్య లక్షా 9వేలు దాటింది. బ్రెజిల్​లో కొత్తగా 3,037 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5లక్షల 87వేలు దాటింది. మొత్తం 32వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్​లో మరో 4,800లకుపైగా కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వివరాలు

ABOUT THE AUTHOR

...view details