ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు లక్షా 92 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో మూడింట రెండొంతుల మంది ఐరోపాలోనే కన్నుమూశారు. ఐరోపాలో మృతుల సంఖ్య 1,16,220కి చేరగా... 12,96,248 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు అమెరికాపై తీవ్ర ప్రభావం
అమెరికాలో ఇప్పటివరకు 8,87,826 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. 15 వేలమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
పాక్‌లో 11వేల కేసులు..
పాకిస్థాన్‌లో వైరస్ కేసులు 11,155కు పెరిగాయి. అయితే 79 శాతం కేసులు స్థానికంగా వ్యాప్తి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు అక్కడ 237 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 2,520 మందికి పైగా వైరస్ నయమైంది.
'ఇరాన్ ఇక రెడ్ జోన్ కాదు..'
ఇరాన్ ఇక ఎంతమాత్రమూ కరోనా రెడ్‌జోన్ కాదని ప్రకటించింది ఆ దేశం. అయితే ఆంక్షలు అమలు అవుతాయని స్పష్టం చేసింది. తాజాగా 93 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చూడండి:కరోనాపై పోరుకు నాసా 'వైటల్' అస్త్రం!