తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆగని కరోనా ఉద్ధృతి.. 62 లక్షలు దాటిన కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,08,767 కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. 3191 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 62 లక్షల 63 వేలు దాటింది.

corona world
ప్రపంచంపై కరోనా పంజా

By

Published : Jun 1, 2020, 7:49 AM IST

మానవాళిపై కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 62 లక్షల 63 వేలు దాటింది. 24 గంటల వ్యవధిలో బాధిత దేశాల్లో 3191మంది ప్రాణాలు కోల్పోయారు. 28 లక్షల 46వేలమంది ఇప్పటివరకు మహమ్మారి నుంచి బయటపడ్డారు.

అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్​లో వైరస్ ఉద్ధృతి ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్​లో 16 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బ్రెజిల్​లో కరోనా బాధితుల సంఖ్య 5 లక్షల 14వేలకు పెరిగింది.

అమెరికాలోనూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యంలో 24 గంటల్లో 20 వేల మందికిపైగా కరోనా నిర్ధరణ అయ్యింది. యూఎస్​లో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షల 37 వేలు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా గణాంకాలు

ఇదీ చూడండి:లీకైన ఫొటోతో మాజీ ప్రధాని అనారోగ్యంపై అనుమానాలు

ABOUT THE AUTHOR

...view details