ఆర్థిక వ్యవస్థలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న ప్రపంచ దేశాల అధినేతలను కరోనా ఉద్ధృతి తీరు కలవరపెడుతోంది. చాలా దేశాల్లో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 59లక్షలు దాటగా, మృతుల సంఖ్య 3.62లక్షలకు ఎగబాకింది.
అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రతిరోజు వేలమందిని తన విషపు కౌగిలి బాధితుల జాబితాలో చేర్చుకుంటోంది కొవిడ్-19. కాస్త తేరుకున్నట్లే కనిపించిన దక్షిణ కొరియాలో కేసులు మళ్లీ పెరుగుతుండటమూ ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ,కెనడా దేశాల్లో రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. టర్కీ, ఇరాన్, చిలీ దేశాల్లో పదుల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. పాకిస్థాన్‌లో మొత్తం బాధితుల సంఖ్య 61 వేల 277కు చేరింది. మృతుల సంఖ్య 12 వందల 60కి ఎగబాకింది. బంగ్లాదేశ్‌లో కేసులు 40 వేల 321కి పెరగ్గా...ఇప్పటివరకు 559 మంది చనిపోయారు.
రెండోస్థానంలో బ్రెజిల్