లామా అనే ఒంటె జాతి జంతువు నుంచి సేకరించిన సూక్ష్మ పరిమాణంలోని కరోనా వ్యతిరేక యాంటీబాడీలు (నానో బాడీలు).. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించగలవని పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన ప్రాథమిక ఫలితాలను సైంటిఫిర్ రిపోర్ట్స్ పత్రిక ప్రచురించింది. "ఒంటె జాతి జంతువుల రోగనిరోధక వ్యవస్థ సహజంగానే ప్రత్యేక రీతిలో నానోబాడీలను ఉత్పత్తి చేస్తుంది. మనుషుల్లోని యాంటీబాడీల బరువులో ఇవి కేవలం పదోవంతే ఉంటాయి. కరోనా మహమ్మారిపై పట్టు సాధించేందుకు ఇవి తోడ్పడగలవు" అని యూనీఫార్మడ్ సర్వీసెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ బ్రాడీ చెప్పారు.
ఒంటె జాతి నానోబాడీలతో కరోనాకు విరుగుడు! - కరోనా ఇన్ఫెక్షన్కు ఒంటెలతో చెక్
కరోనా ఈ పేరు.. దీని ఊరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. కొవిడ్‌కు వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో తలమునకలై ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో ఒంటె జాతి జంతువుల నానోబాడీలు వైరస్‌ను సమర్ధంగా అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఒంటె జాతి నానోబాడీలతో కరోనాకు విరుగుడు!
కోర్మాక్ అనే లామాకు పరిశోధకులు 28రోజుల వ్యవధిలో మొత్తం ఐదుసార్లు కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్‌ను ఎక్కించారు. అనంతరం ఈ జంతువు నుంచి పలు రకాల నానోబాడీలను సేకరించి, ప్రయోగశాలలో పరీక్షించారు. వీటిలో 13 రకాల నానోబాడీలు కొవిడ్ ఇన్ఫెక్షన్ను అడ్డుకోగలవని గుర్తించారు. ముఖ్యంగా 'ఎన్ఐహెచ్-కోవ్ఎన్బి-112' రకం నానోబాడీలు ఇన్ఫెక్షన్ను అత్యంత సమర్థంగా అడ్డుకుంటాయన్న నిర్ధరణకు వచ్చినట్లు పరిశోధనకర్త ధామస్ ఎస్పర్జా వివరించారు.