Corona free countries: కరోనా సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. ఊహించని రీతిలో కేసులు, మరణాలతో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. రోజుకు లక్షల కేసులు, వేల మరణాలతో శవాలను కుప్పలుగా ఖననం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కరోనా కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి అంటే ఏంటో కూడా వాటికి తెలియదు. ఆ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం.
టోంగా
ఇది దక్షిణ పసిఫిక్ సముద్రంలో 170 ద్వీపకల్పాలతో ఏర్పడిన దేశం. ఇక్కడ ఇప్పటివరకు ఒక్కటే కరోనా కేసు నమోదైంది. ఈ దేశ జనాభా 1,07,471 మాత్రమే.
మైక్రోనేషియా
ఇది కూడా పసిఫిక్ మహాసముద్రంలో 600 ద్వీకల్పాలతో ఏర్పడిన దేశం. మొత్తం నాలుగు రాష్ట్రాలుంటాయి. ఇక్కడా ఇప్పటివరకు ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది. ఈ దేశం మొత్తం జనాభా 1,16,811.
సెయింట్ హెలెనా
సెయింట్ హెలెనా బ్రిటిష్ విదేశీ భూభాగంలోని ద్వీపకల్ప దేశం. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు రెండే కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ ఇద్దరు కూడా కోలుకున్నారు. ఈ దేశ మొత్తం జనాభా కేవలం 6,104 కావడం గమనార్హం. నెపోలియన్ ఇక్కడే మరణించారని చెబుతారు.
సమోవా
రెండు ద్వీపకల్పాలతో ఏర్పడిన ఈ దేశంలో ఇప్పటివరకు ముడు కరోనా కేసులే నమోదయ్యాయి. బాధితులు కూడా పూర్తిగా కోలుకున్నారు. ఈ దేశ జనాభా 2,00,396.
మార్షల్ ఐలాండ్స్..