తెలంగాణ

telangana

129 జింకలకు కొవిడ్​- మనుషుల నుంచే వైరస్​ వ్యాప్తి!

By

Published : Dec 24, 2021, 5:33 PM IST

Covid in whitetail deer: అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో 129 జింకల్లో కరోనా వైరస్​ ఉన్నట్లు తేలింది. అందులో మూడు వేరియంట్లను గుర్తించారు పరిశోధకులు. జింకలకు వైరస్.. మనుషుల నుంచే సంక్రమించిందని తెలిపారు. జింకల్లో వైరస్​ మ్యూటెషన్లు అధికంగా ఉండే అవకాశం ఉందని, అదే జరిగితే.. వైరస్​ను ఎదుర్కొనేందుకు సామర్థ్యం మనుషుల్లో చాలా తక్కువని పేర్కొన్నారు.

covid found in whitetail deer
జింకలకు కొవిడ్

Corona found in deer: అమెరికాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పుడు ఆ వైరస్​ జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్ల తోక జింకల్లో మూడు రకాల కొవిడ్​-19 వేరియంట్స్​ను గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు. మనుషుల నుంచే జింకలకు వైరస్​ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.

2021, జనవరి నుంచి మార్చి మధ్యలో ఈశాన్య ఒహాయోలోని తొమ్మిది ప్రాంతాల్లో 360 తెల్ల తోక జింకల నాసల్​ స్వాబ్స్​ సేకరించారు ఒహాయో స్టేట్​ యూనివర్శిటీ పరిశోధకులు. పీసీఆర్​ టెస్టింగ్​ ద్వారా అందులో 129 జింకల్లో(35.8శాతం) మూడు రకాల వేరియంట్లను గుర్తించారు.

ఈ అధ్యయనం నేచర్​ జర్నల్​లో ప్రచురితమైంది. అడవి జింకలు సార్స్​ కోవ్​-2 వైరస్​కు రిజర్వాయర్లుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.

" అడవి జింకలు వ్యాధి బారిన పడడం.. మానవుల వెలుపల వైరస్​కు కొత్త హోస్ట్​ ఉండవచ్చనే ఆలోచనకు దారి తీస్తుంది. అటవీ జంతువులు సైతం వైరస్​ బారినపడతాయని తేలింది. వాటిలో వైరస్​ దీర్ఘకాలం కొనసాగితే.. మనుషులకు సార్స్​ కోవ్​-2 వైరస్​ సంక్రమించే కొత్త మూలాన్ని కలిగి ఉన్నట్లే. మనుషుల్లో మాదిరిగానే.. జింకల్లోనూ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో కొవిడ్​-19 కట్టడి చేసే ప్రణాళికలను సంక్లిష్టంగా మార్చవచ్చు. మా సీక్వెన్సింగ్​ థియరీ ప్రకారం మనుషుల నుంచి జింకలకు వైరస్​ సంక్రమించిందని తెలిసింది. జింకల్లోకి ఆరు విభిన్న వైరస్​లు సోకినట్లు మా వద్ద ఆధారాలున్నాయి. జింకల్లో వైరస్​ మ్యుటేషన్లు జరిగితే.. మనుషులతో పాటు ఇతర జీవుల్లోకి కొత్త వేరియంట్లు సంక్రమించే ప్రమాదం ఉంది."

- ఆండ్రూ బౌమాన్​, ఒహాయో వర్సిటీ అసోసియేట్​ ప్రొఫెసర్​.

2021 తొలినాళ్లలో ఒహాయోలో బీ.1.2 వైరస్​ వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. వివిధ ప్రాంతాల్లో ఈ వైరస్​ జింకల్లోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు పరిశోధకులు. ప్రతి ప్రాంతంలో 18 సార్లు నమూనాలు సేకరించారు. వివిధ ప్రాంతాల్లో జింకల్లో 13.5 శాతం నుంచి 70 శాతం వరకు వైరస్​ వ్యాప్తి ఉన్నట్లు గుర్తించారు. అత్యధిక జనాభా కలిగిన నాలుగు ప్రాంతాలకు సమీపంలోని జింకల్లో వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

ఇదీ చూడండి:'ఒమిక్రాన్​పై పనిచేయని టీకాలు.. రెండు డోసులు తీసుకున్నా...'

అమెరికాలో 2.6లక్షల కేసులు.. వణుకుతున్న ప్రపంచ దేశాలు

ఒమిక్రాన్​ను ఎదుర్కోవడంలో చైనా టీకా విఫలం.. బూస్టర్​తోనూ రక్షణ నిల్!

కరోనా చికిత్సకు తొలి ట్యాబ్లెట్- వైరస్​పై గెలుపు ఇక సులువయ్యేనా?

ABOUT THE AUTHOR

...view details