అమెరికాలో 45 శాతం మంది టీకా లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ పూర్తైన వేళ రోజువారీ కొవిడ్ మరణాలు 10 నెలల కనిష్ఠానికి దిగి వచ్చాయి. బుధవారం కొత్తగా 600 మరణాలు నమోదవగా.. గతేడాది జులై తర్వాత ఇవే అతి తక్కువ రోజువారీ మరణాలని అమెరికా ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు సగానికిపైగా రాష్ట్రాల్లో మరణాలు సున్నాగా నమోదు కాగా.. మరికొన్ని రాష్టాల్లో రోజువారీ ఈ సంఖ్య రెండంకెల కంటే దిగువకు వచ్చాయి.
రోజువారీ కరోనా కేసుల సంఖ్య గతేడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారి 38 వేల దిగువకు తగ్గిందని అమెరికా ఆరోగ్యశాఖ వివరించింది. జనవరి నుంచి అమెరికాలో సగటున రోజూ 3,400 మంది కరోనాకు బలవుతున్నారు. గత నెల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకోగా మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు వివరించారు.