ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు కరోనా కేసులు 12 లక్షల 87 వేలు దాటగా, మృతుల సంఖ్య 70 వేలు మించింది. మరో వైపు 2 లక్షల 71 వేలకి పైగా కరోనా బాధితులు కోలుకోవడం ఊరట కలిగిస్తోంది.
ఐరోపాలో మృత్యు ఘోష
కరోనా మహమ్మారి మృత్యు కౌగిలిలో ఐరోపా దేశాలు నలిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 6,75 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. 50 వేలకుపైగా మృత్యువాతపడ్డారు.
స్పెయిన్:స్పెయిన్లో ఈ ఒక్క రోజే 414 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 13,055కు చేరుకుంది. అక్కడ కొత్తగా 3,386 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 1,35,032కు చేరుకుంది. అయితే అక్కడ క్రమంగా కరోనా మరణాలు తగ్గుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
బెల్జియం, నెదర్లాండ్స్:బెల్జియంలో ఈ ఒక్క రోజే 185 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 1,632కు పెరిగింది. నెదర్లాండ్స్లో చనిపోయిన వారి సంఖ్య 1,766కు చేరింది. మరోవైపు జర్మనీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటగా.... మృతుల సంఖ్య 1,584కు చేరింది.
ఇటలీ:మృతుల సంఖ్య 15,877కు చేరింది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య లక్షా 30 వేలకు చేరువైంది.
బ్రిటన్:మొత్తం మృతుల సంఖ్య 4,934... కాగా కరోనా కేసుల సంఖ్య 47,800 దాటింది. కరోనా లక్షణాలు బయటపడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ను ఆసుపత్రికి తరలించారు.
ఫ్రాన్స్: వైరస్ సోకి ఇప్పటి వరకు దేశంలో 8,078 మంది మరణించగా... కేసుల సంఖ్య 92,800 దాటింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంతగా నష్టపోయిన ఫ్రాన్స్... ఆర్థిక మాంద్యం దిశగా కొనసాగుతోందని ఆ దేశ ఆర్థికమంత్రి ప్రకటించడం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో తెలుపుతుంది.
ఆసియా దేశాల్లో కరోనా బీభత్సం