తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​లో​ 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు - బ్రెజిల్​లో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 75 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 8 లక్షల 97 వేలు దాటింది. అమెరికా, బ్రెజిల్​ దేశాల్లో వైరస్ కేసులు అధికంగా బయటపడుతున్నాయి.

Corona cases worldwide
పాకిస్థాన్​లో​ 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

By

Published : Sep 8, 2020, 9:11 PM IST

కరోనా వల్ల ప్రపంచదేశాలు అతలాకుతలమవుతున్నాయి.. ఇప్పటివరకు 2 కోట్ల 75 లక్షల 24 వేల మందికి పైగా వైరస్​ బారిన పడ్డారు. మొత్తం 8,97,638 మంది ప్రాణాలు కోల్పోయారు. కోటి 96 లక్షల 25 వేల మందికిపైగా కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

కొవిడ్​ కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో మొత్తం 64.87 లక్షల కేసులు వెలుగు చూశాయి. బ్రెజిల్​లో దాదాపు 43 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు.

  • రష్యాలో తాజాగా 5 వేల మందికి కరోనా పాజిటివ్​ తేలగా.. మొత్తం 10.35 లక్షల కేసులు నమోదయ్యాయి .
  • నేపాల్​లో కొత్తగా 902 మందికి వైరస్​ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 48 వేలు దాటింది
  • పాక్​లో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దాదాపు 3 లక్షల మంది వైరస్​ బారిన పడ్డారు. మరో ఐదుగురు మృతి చెందారు.
  • మెక్సికోలో మరో 3,486 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 223 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశం కేసులు మరణాలు
అమెరికా 64,87,763 1,93,595
భారత్​ 43,13,129 73,105
బ్రెజిల్ 41,47,794 1,27,001
రష్యా 10,35,789 17,993
పెరు 6,91,575 29,976

ABOUT THE AUTHOR

...view details