Corona cases worldwide: కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 31లక్షల 86వేల 254 కేసులు నమోదయ్యాయి. మరో 7,606 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో విశ్వవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 32 కోట్ల 6లక్షల 87వేల 118కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 55లక్షల 38వేల 809కి చేరింది. 26కోట్ల 40లక్షల 17వేల 707మంది వైరస్‌ను జయించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5కోట్ల 11లక్షల 30వేల 602గా ఉంది.
- అగ్రరాజ్యం అమెరికాలో క్రితం రోజుతో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 8లక్షల 6వేల 493 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 1,969 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8లక్షల 69వేల 212కి చేరగా.. కేసుల సంఖ్య 6కోట్ల 23లక్షల 64వేల 475కి పెరిగింది.
- అమెరికా తర్వాత ఫ్రాన్స్‌లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,05,322 కేసులు బయటపడ్డాయి. మరో 225మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటీ 32లక్షల 40వేల 304కి చేరింది. మృతుల సంఖ్య 1,26,530గా ఉంది.
- ఇటలీలో కొత్తగా 1,84,615 కేసులు వెలుగు చూశాయి. మరో 316 మంది మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 81లక్షల 55వేల 645కి చేరింది. మృతుల సంఖ్య 1,40,188కి పెరిగింది.
- స్పెయిన్‌లో 1,59,161 కొత్త కేసులు, 112 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 79లక్షల30వేల 528గా, మొత్తం మృతుల సంఖ్య 90,620గా ఉంది.
- అర్జెంటీనాలో కొత్తగా 1,28,402 మందికి వైరస్ సోకింది. మరో 138మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 67లక్షల 93వేల 119కి చేరగా.. మరణాల సంఖ్య 1,17,808గా ఉంది.
- జర్మనీ, బ్రెజిల్, భారత్‌లోనూ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.