ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 6.7 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9.73 కోట్లకు చేరుకుంది. కొత్తగా 17 వేలకుపైగా మరణాలు నమోదు కావడం కాగా.. మొత్తం మృతుల సంఖ్య 20.8 లక్షలకు చేరుకుంది. 6.9 కోట్ల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా అమెరికాలో 1.8 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2.5 కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మరో 6.7లక్షల మందికిపైగా కరోనా - కరోనా కేసుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 6.7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా ఇప్పటివరకు కారణంగా 20 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగని కరోనా ఉద్ధృతి
కొవిడ్ ఉద్ధృతి అమెరికా, బ్రెజిల్, మెక్సికో, బ్రిటన్ దేశాల్లో తీవ్రంగా ఉంది.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 2,49,98,975 | 4,15,894 |
బ్రెజిల్ | 86,39,868 | 2,12,893 |
మెక్సికో | 16,88,944 | 1,44,371 |
బ్రిటన్ | 35,05,754 | 93,290 |
ఇదీ చదవండి :బ్రిటన్లో ఆగని కరోనా మరణ మృదంగం