తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా ప్రళయం.. అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కేసులు - అమెరికా కరోనా కేసులు

Corona cases in America: అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి రాకెట్​ వేగంతో దూసుకెళుతోంది. సోమవారం ఒక్కరోజే 10లక్షలు కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో లక్షకుపైగా చికిత్స పొందుతున్నారు.

US reports 1 million new COVID cases in a day
కరోనా ప్రళయం.. అమెరికాలో ఒక్కరోజే 10 లక్షల కేసులు

By

Published : Jan 4, 2022, 10:07 AM IST

Updated : Jan 4, 2022, 10:59 AM IST

Corona cases in America: అమెరికాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతూ ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 10 లక్షల కేసులు నమోదయ్యాయి. గతంలో వచ్చిన కొవిడ్​ దశలతో పోల్చితే.. ప్రస్తుతం మూడు రెట్లకుపైగా కేసులు నమోదవుతున్నాయని 'యూఎస్​ఏ టుడే' తెలిపింది.

సోమవారం సాయంత్రం 7.30 నాటికి జాన్స్​ హాప్కిన్స్​ యూనివర్సిటీ డేటా ప్రకారం.. 10,42,000 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్ని రాష్ట్రాల కేసులు వివరాలు ఉన్నట్లు స్పష్టంగా తెలియదు. అయితే.. గతంలో పరీక్షలు చేసి.. ఫలితాలు తాజాగా వెలువడిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. 'గత వారం కరోనా కేసుల సంఖ్య వెలువడిన క్రమంలో.. కొత్త కేసుల్లో స్థిరమైన పెరుగుదల ఉంటుంది. గతవారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరికి కరోనా పాజిటివ్​గా నమోదైంది' అని పేర్కొంది.

ఆసుపత్రుల్లో లక్షకుపైగా..

ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికాలో నాలుగు నెలల గరిష్ఠానికి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య చేరింది. ప్రస్తుతం 100,000 మంది పౌరులు ఆసుపత్రుల్లో చేరినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా ప్రజారోగ్య, సేవల విభాగం నివేదిక ప్రకారం.. 2021, జనవరి 14న 1,42,000 మంది ఆసుపత్రిలో చేరారు. అది 2021, సెప్టెంబర్​లో లక్షకు దిగొచ్చింది.

కరోనాపై బైడెన్​ సమీక్ష..

దేశంలో ఒమిక్రాన్​ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో వైరస్​ పరిస్థితులను సమీక్షించేందుకు శ్వేతసౌధం కరోనా స్పందన బృందంతో.. అధ్యక్షుడు జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​లు మంగళవారం భేటీ కానున్నారు.

ఫైజర్​ బయోఎన్​టెక్​ టీకాకు అనుమతి..

జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 55 మిలియన్లకుపైగా కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రతి ఆరుగురిలో ఒక్కరికి కరోనా సోకింది. 8,26,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. 12-15 ఏళ్ల వయసు వారితో పాటు బూస్టర్​ డోస్​ అందించేందుకు ఫైజర్​ బయోఎన్​టెక్​ టీకాకు అనుమతులు ఇచ్చింది ఎఫ్​డీఏ.

ఇదీ చూడండి:అమెరికా రక్షణ మంత్రికి కరోనా పాజిటివ్​

అమెరికాలో 'కొవిడ్​' ఉప్పెన.. ఒక్కరోజులో 5.6లక్షల కేసులు

Last Updated : Jan 4, 2022, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details