ఆంక్షల సడలింపుల తరువాత ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మొత్తం కొవిడ్ కేసులు కోటీ 12 లక్షలకు చేరువకాగా, మృతుల సంఖ్య 5 లక్షల 29 వేలు దాటింది.
కరోనా ధాటికి అమెరికా అతలాకుతలం అవుతోంది. కొత్తగా అక్కడ 54 వేలకుపైగా కొవిడ్ కేసులు, 616 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 28 లక్షల 90 వేలకు, మరణాల సంఖ్య లక్షా 32 వేలకు పైగా పెరిగింది.
బ్రెజిల్
బ్రెజిల్లో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా అక్కడ 41 వేల 9 వందలకుపైగా కరోనా కేసులు నమోదుకాగా వేయి 264 మంది మృత్యువాతపడ్డారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షల 43 వేలకు పైగా పెరిగాయి. మరణాల సంఖ్య 63 వేలు దాటింది.
రష్యాలో మరో 6,718 కేసులు నమోదయ్యాయి. 176 మరణాలు సంభవించాయి. మెక్సికోలో గడచిన 24 గంటల్లో 6,740 కేసులు, 654 మరణాలు నమోదయ్యాయి.