ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. మరో 6లక్షల 35వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7కోట్ల 20లక్షల 89వేలు దాటింది. వారిలో 16లక్షల 10వేల మందినిపైగా కొవిడ్ బలితీసుకుంది. కరోనా సోకినవారిలో ఇప్పటివరకు 5 కోట్ల 4లక్షల మంది కోలుకున్నారు. సుమారు 2కోట్ల యాక్టివ్ కేసులున్నాయి.
- అమెరికాలో వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కొత్తగా 2లక్షల 20వేల 298 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో కేసుల సంఖ్య కోటీ 65లక్షలు దాటింది. మహమ్మారి ధాటికి మరో 2,309 మంది బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3లక్షల 5వేలకు పెరిగింది.
- బ్రెజిల్లో మరో 44వేలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. బాధితుల సంఖ్య 68లక్షలకు పెరిగింది. వైరస్ కారణంగా మరో 690 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 1.81లక్షలు దాటింది.