తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా మహాఉద్ధృతి- కోటీ 45 లక్షలకు చేరువలో కేసులు! - corona cases latest deaths

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య కోటీ 45 లక్షలకు చేరువైంది. 6 లక్షలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, భారత్​, రష్యా, పెరు వంటి దేశాల్లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Corona cases
ఆగని కరోనా ఉద్ధృతి

By

Published : Jul 19, 2020, 7:23 AM IST

Updated : Jul 19, 2020, 9:15 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహాఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజుకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 2.30 లక్షల కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. మొత్తం కేసుల సంఖ్య కోటీ 45 లక్షలకు చేరువైంది. 6 లక్షల మందికిపైగా మృతి చెందారు.

  • మొత్తం కేసుల సంఖ్య : 14,422,091
  • మొత్తం మరణాలు: 604,818
  • కోలుకున్నవారు: 8,606,629
  • యాక్టివ్​ కేసులు: 5,210,644

ఐదోస్థానానికి దక్షిణాప్రికా..

దక్షిణాఫ్రికాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్యలో పెరును వెనక్కి నెట్టి ఐదోస్థానానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు మూడున్నర లక్షలు దాటాయి. దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

చైనాలో మళ్లీ విజృంభణ..

చైనాలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. పశ్చిమ రాష్ట్రం జిన్జియాంగ్​ రాజధాని ఉరుంకికిలో ఒక్కసారిగా వైరస్​ కేసులు పెరగటంపై అప్రమత్తమైంది ప్రభుత్వం. వైద్య నిపుణుల బృందాన్ని అక్కడికి పంపించింది. గత శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నానికి 11 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు మరో 23 లక్షణాలు కనబడని కేసులు ఉన్నాయి. మొత్తం 269 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

అమెరికాలో..

ఇప్పటికే కేసులు, మరణాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న అమెరికాలో.. వైరస్​ ఉద్ధృతి తగ్గటం లేదు. రోజు రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 63 వేలకుపైగా కొత్త కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 38 లక్షలు దాటింది. మరణాలు 1.42 లక్షలు దాటాయి. దాదాపు 18 లక్షల మందికి వరకు వైరస్​ నుంచి కోలుకున్నారు.

బ్రెజిల్​లో​..

కేసుల పరంగా రెండో స్థానంలో కొనసాగుతోంది బ్రెజిల్​. కొత్త కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 30వేలకుపైగా కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 21 లక్షలకు చేరువైంది. దాదాపు 79 వేల మంది మరణించారు.

రష్యాలో..

రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసుల పరంగా నాలుగో స్థానానికి చేరుకుంది రష్యా. గత 24 గంటల్లో 6వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 7.65 లక్షలు దాటింది. 12వేలకుపైగా మరణాలు సంభవించాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 3,833,271 142,877
బ్రెజిల్​ 2,075,246 78,817
రష్యా 765,437 12,247
దక్షిణాఫ్రికా 350,879 4,948
పెరు 349,500 12,998
మెక్సికో 338,913 38,888
చిలీ 328,846 8,445
స్పెయిన్ 307,335 28,420
Last Updated : Jul 19, 2020, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details