ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్, రష్యాల్లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. 55 లక్షల 90 వేల 350మందికి పైగా వైరస్ బారినపడ్డారు. 3,47,900మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో తీవ్రం..
అమెరికాలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ గణాంకాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజులోనే 19,790 మందికి వైరస్ సోకింది. 505 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 55,90,358 మంది వైరస్ బారినపడ్డారు. 3,47,907మంది కరోనాకు బలయ్యారు.
చైనాలో మరో 36మందికి..
చైనాలో మరో 36మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇందులో 29 దొంగ కరోనా కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకినట్లు తేలిందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం లక్షణాలు లేకుండా కరోనా సోకిన 403మందిని వైద్య పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 82,992మందికి వైరస్ సోకింది. 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు.