తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా విలయం-9 లక్షలకు చేరువలో మరణాలు - corona news

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కోరలుచాస్తోంది. మహమ్మారి కాటుకు మరణించినవారి సంఖ్య 9 లక్షలకు చేరువైంది. 2.74 కోట్ల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. అమెరికాలో వైరస్​ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. బ్రెజిల్​లో మరణాల సంఖ్య 1.27 లక్షలు దాటింది. ఈజిప్ట్​లో కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి.

Corona cases
కరోనా విలయం

By

Published : Sep 8, 2020, 9:11 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మహావిలయం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి నేటి ఉదయం వరకు 2 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాదాపు 10వేల మంది వరకు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 75 లక్షలకు, మరణాలు 9 లక్షలకు చేరువయ్యాయి.

  • మొత్తం కేసులు: 27,485,488
  • మరణాలు: 896,842
  • కోలుకున్నవారు: 19,587,099
  • యాక్టివ్​ కేసులు: 7,001,547

అమెరికాలో..

అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి తగ్గముఖం పట్టినట్లు కనిపిస్తోంది. సోమవారం కొత్తగా 25వేల కేసులు నమోదయ్యాయి. 284 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 64.85లక్షలకు చేరగా.. మరణాలు 2 లక్షలకు చేరువయ్యాయి.

బ్రెజిల్​లో లక్షా 27వేలు దాటిన మరణాలు

బ్రెజిల్​లో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. సోమవారం 10వేలకుపైగా కొత్త కేసులు రాగా 310 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41.47 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 1.27లక్షల మార్కును దాటింది.

ఈజిప్ట్​లో లక్ష దాటిన కేసులు

ఈజిప్ట్​లో వైరస్​ వేగంగా విజృంభిస్తోంది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 5,541 మంది మరణించగా.. 79 వేల మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు ఇలా..

దేశం కేసులు మరణాలు
అమెరికా 64,85,575 1,93,534
బ్రెజిల్ 40,47,794 1,27,001
రష్యా 10,30,690 17,871
పెరు 6,91,575 29,976
కొలంబియా 6,71,848 21,615
దక్షిణాఫ్రికా 6,39,362 15,004
మెక్సికో 6,37,509 67,781

ABOUT THE AUTHOR

...view details