తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 83వేల మందికి కరోనా - ప్రపంచంలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజులో 83వేలకు పైగా కేసులు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక్కరోజులో కేసుల సంఖ్య 83 వేలకు పైగా పెరిగింది. 24 గంటల్లో 2717 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona world map
ప్రపంచంలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజులో 83వేలకు పైగా కేసులు

By

Published : Jun 12, 2020, 11:00 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడినవారి సంఖ్య 76,68,000 దాటింది. 4,25,800 మందికి పైగా కొవిడ్-19కు బలయ్యారు. వ్యాధి నుంచి 38,84,000 మందికి పైగా కోలుకున్నారు.

అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 20,99,300 దాటింది. 24 గంటల్లో 9,600 పైగా బాధితులుగా మారారు. కొత్తగా 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,16,200 మందికి పైగా ఉంది.

బ్రెజిల్​లో 3700 పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,09,400కు చేరువైంది. 41,162 మంది కన్నుమూశారు.

రష్యాలో కొత్తగా వైరస్ సోకినవారి సంఖ్య 8987గా ఉంది. బాధితుల సంఖ్య 5,11,400 దాటింది. మరణాల సంఖ్య 6,715గా ఉంది.

బ్రిటన్​లో కొత్తగా 1,500 మందికి పైగా వైరస్ సోకింది. బాధితుల సంఖ్య 2,92,950పైగా ఉంది. మొత్తంగా మృతుల సంఖ్య 41,481గా ఉంది.

స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

పాకిస్థాన్‌లో వైరస్ బాధితుల సంఖ్య 1, 26,000కు చేరువైంది. ఇప్పటివరకు 2,463 మంది చనిపోయారు. బంగ్లాదేశ్‌లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 81, 500 పైగా ఉంది. ఇప్పటివరకు 1,095 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:బ్రిటన్​లో గాంధీ విగ్రహానికి బోర్డులతో రక్షణ

ABOUT THE AUTHOR

...view details