కొవిడ్-19 మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల పరంగా అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరువైంది. 4.91 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 52.50 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు.
కరోనా పంజా: 'కోటి'కి చేరువలో కేసులు - covid-19 latest news
ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరువైంది. మరణాలు 5 లక్షలకు చేరువలో ఉన్నాయి.
![కరోనా పంజా: 'కోటి'కి చేరువలో కేసులు Global COVID-19 tracker](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7777190-740-7777190-1593155801169.jpg)
ప్రపంచవ్యాప్తంగా 'కోటి'కి చేరువలో కరోనా కేసులు
వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో కొత్త కేసుల నమోదు అత్యల్పంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. బీజింగ్ సహా ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ గురువారం 13 కొత్త కేసులు మాత్రమే నమోదైనట్లు తెలిపింది. అందులో 11 బీజింగ్‌లో నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు విదేశీయులు. కొత్తగా మరణాలు సంభవించలేదని, ప్రస్తుతం 398 మంది చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేసింది చైనా ఆరోగ్య శాఖ.
ఇదీ చూడండి: మానసిక రోగిపై తండ్రీకొడుకుల అత్యాచారం!