COP kneeling on student's neck: అమెరికా విస్కాన్సిన్‌లోని కెనోషా పాఠశాలలో జరిగిన గొడవలో ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి ఓ విద్యార్థినిపై అమానుషంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పాఠశాల యాజమాన్యం విడుదల చేసింది.
ఏం జరిగిందంటే?
భోజనం చేస్తున్న సమయంలో 12 ఏళ్ల బాలిక మరో బాలునితో గొడవ పడింది. ఇది చూసిన ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి.. బాలిక మెడపై మోకాలిని ఉంచి.. ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించాడు. అంతేగాకుండా సుమారు అరనిమిషం పైటు బాలిక పైకి లేవకుండా చేతులు కట్టేశాడు. ఈ ఘటన మార్చి 4వ తేదీన జరిగింది. అమ్మాయిపై దురుసుగా ప్రవర్తించిన ఈ వ్యకిని షాన్ గుట్‌షోగా గుర్తించారు అధికారులు. అతడు పాఠశాలలో పార్ట్ టైమ్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు.
బాలిక మెడపై మోకాలు నొక్కి పెట్టిన సెక్యురిటీ బాలిక చేతులు మెలిపెడుతున్న సెక్యురిటీ బాలికను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించగా.. అదే సమయంలో ఆమె గుట్షోను వెనక్కి నెట్టేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో అతని తల పక్క ఉన్న బల్లకు బలంగా తగిలింది. తిరిగి లేచిన అతడు బాలికను అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను కదలకుండా పడుకోబట్టి, మెడపైన కాలు ఉంచినట్లు తెలుస్తోంది.
విద్యార్థినిని అదుపు చేస్తున్న గుట్షో అయితే ఈ ఘటనకు సంబంధించి గుట్షోపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి కావాలని చేసిన ఈ దాడి కారణంగా తన కూతురికి గాయాలు అయ్యాయని.. న్యూరాలజిస్ట్ వద్ద థెరపీ చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు.. పెయిడ్ లీవ్‌లో ఉన్నట్లు పాఠశాల అధికారులు చెప్తున్నారు. కానీ, అతడు తన సెక్యూరిటీ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పాఠశాల యాజమాన్యం నుంచి తనకు సరైన మద్దతు లేకపోడం, కుటుంబ పోషణ కష్టం కావడం వల్ల ఈ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు గుట్షో.
ఇదీ చూడండి:
మనమే కాదు.. రష్యా నుంచి చమురు కొనే దేశాలు ఎన్నో..