కొవిడ్‌పై భారత్ పోరులో బైడెన్ ప్రభుత్వ సహకారాన్ని వేగవంతం చేసే తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు పలువురు అమెరికా శాసనకర్తలు. దీనిని కాంగ్రెస్ సభ్యులు బ్రాడ్ షెర్మన్, స్టీవ్ ఛాబట్ రూపొందించారు. భారత్‌కు అదనంగా అత్యవసరమైన వైద్య పరికరాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటైనర్లు అందించాలని తీర్మానంలో కోరారు.
భారత్‌కు అదనపు సాయానికి యూఎస్ కాంగ్రెస్‌లో తీర్మానం - భారత్ కు అమెరికా సాయం
కరోనా మహమ్మారిపై పోరులో భారత్‌కు అందిస్తున్న సహకారాన్ని వేగవంతం చేయాలని బైడెన్ సర్కారును కోరారు అమెరికా చట్టసభ్యులు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. భారత్‌కు అత్యవసరమైన వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Congressional resolution introduced to support India during COVID19 crisis
కరోనా కట్టడిలో భారత ప్రజలకు మద్దతుగా నిలవాలని తీర్మానం పేర్కొంది. అందుకోసం అమెరికా చేస్తున్న కృషిని కొనియాడింది. భారత్‌లో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసరమైన వైద్య పరికరాలు, టీకా ముడిసరకులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను బైడెన్ సర్కారు పంపించిందనితీర్మానం పేర్కొంది. ఆరోగ్య రంగంలో భారత్‌తో అమెరికాకు ఏడు దశాబ్దాల బంధం ఉందని తెలిపింది.
ఇదీ చూడండి:భారత్‌కు 5కోట్ల వ్యాక్సిన్ డోసులు?