దేశంలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా చట్టసభలో భారత్ వ్యవహరాలు పర్యవేక్షించే ప్రతినిధుల బృందం(కాకస్) స్పందించింది. ప్రజాస్వామ్య నిబంధనల మేరకు అన్నదాతలు శాంతియుతంగా ఆందోళనలు చేసేందుకు అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వానికి సూచించింది. ఆందోళన ప్రదేశాల్లో అంతర్జాల సదుపాయం కల్పించాలని కోరింది.
రైతు ఆందోళనలపై ఇప్పటికే అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్‌తో మాట్లాడినట్లు భారతీయ కాకస్ సహ-అధ్యక్షుడు బ్రాడ్ షీర్‌మన్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అమెరికా చట్టసభ్యులు అన్నదాతల నిరసనలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
"ప్రజాస్వామ్య నిబంధనలు అమలయ్యేలా చూడాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు నిరసనకారులకు అనుమతించాలని కోరుతున్నా. నిరసన ప్రాంతాల్లోకి జర్నలిస్టులను అనుమతించాలి. ఇరుపక్షాలు త్వరలోనే ఓ అంగీకారానికి వస్తారని భారత్ స్నేహితులంతా భావిస్తున్నారు"