తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా పర్యటనలో జైశంకర్ కీలక చర్చలు - భారత విదేశాంగ మంత్రి జైశంకర్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. కొవిడ్ సమయంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా వాక్సిన్ల ఉత్పత్తి, వాటికి కావలసిన ముడి పదార్థాల అంశం ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా బలపడడానికి ఈ పర్యటనను చేపడుతున్నారు.

Jaishankar
జైశంకర్

By

Published : May 25, 2021, 1:25 PM IST

Updated : May 25, 2021, 2:13 PM IST

సమకాలీన అంశాలపై భారత్ చర్చలను రూపొందిస్తుందూనే ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తిని కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా జనవరిలో ఎన్నికయ్యాక జైశంకర్ తొలిసారి అక్కడికి వెళ్లారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం న్యూయార్క్ కు చేరుకుని అటునుంచి భద్రాత మండలికి వెళ్లారు. ఐరాసలో భారత్​ తరఫున తమ కృషిని ప్రశంసించినందకు తిరుమూర్తి.. జైశంకర్​కు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ఐరాస సెక్రెటరీ జనరల్ అంటోనియో గుటెరస్​ను జైశంకర్ కలవనున్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​తోనూ జైశంకర్​ భేటీ కానున్నారు. వీరిద్దరి సమావేశం ఎప్పుడు జరుగుతుందో అధికార వర్గాలు ఇంకా సమాచారం ఇవ్వలేదు.

అమెరికా సమావేశంలో చర్చించనున్న అంశాలు

  • కరోనా సమస్యలు, భారత్లో వాక్సిన్ ఉత్పత్తి వేగవంతం
  • టీకా తయారీకి కావల్సిన ముడిసరుకుల రవాణాలో జాప్యం, తదితర సమస్యలను అమెరికా అధ్యక్షుడు జో బెడెన్​కు తెలియజేయడం
  • క్వాడ్ కూటమి గురించి
  • పసిఫిక్ ఆసియాలో నెలకొన్న సమస్యల ప్రస్థావన
  • భద్రతా సమస్యలు
  • ఐటీరంగం, డిజిటల్ భాగస్వామ్యం, విద్యారంగంపై చర్చలు

అయితే కొవిడ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి కరోనాపై పోరాటంలో భారత్​కు సాయం చేయాలని ప్రభుత్వానికి జోబైడెన్ సూచించారు. భారత్ సహజ మిత్రదేశమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:భారత్​కు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ ధన్యవాదాలు

Last Updated : May 25, 2021, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details