మానవ కణాల్లోకి ప్రవేశించి, తన సంఖ్యను పెంచకోవడానికి కరోనా వైరస్‌కు ఉపయోగపడే రెండు కీలక ప్రోటీన్లను.. వాటిని అడ్డుకోగల పదార్థాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొవిడ్ కారక సార్స్-కోవ్2 వైరస్ బహుళ అంచెల్లో మానవ శరీరంపై దాడి చేస్తుంది. మొదట ఊపిరితిత్తుల లోపల ఉండే కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కణ యంత్రాగాన్ని హైజాక్ చేసి, భారీగా తన ప్రతులను ఉత్పత్తి చేస్తుంది.
మానవ కణంలో కరోనా ప్రవేశానికి అడ్డుకట్ట - ప్రొటీన్ క్యాథెస్పిన్ ఎల్
కరోనాపై పోరులో మరో కీలక అధ్యయనానికి తెరతీశారు శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి ప్రవేశించి కరోనా వైరస్‌కు ఉపయోగపడే రెండు కీలక ప్రోటీన్లను గుర్తించారు. వాటికి అడ్డుకట్ట వేసే పదార్థాలనూ కనుగొన్నారు.
మానవ కణంలో కరోనా ప్రవేశానికి అడ్డుకట్ట
కణంలోకి ప్రవేశించడానికి వైరస్‌కు 'లైజోజోముల్ ప్రొటీజ్ క్యాథెస్పిన్ ఎల్' అనే మానవ ప్రొటీన్, కణంలో తన ప్రతులను పెంచకోవడంలో 'ఎంపీఆర్వో' అనే వైరల్ ప్రోటీన్‌ను వైరస్ ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పదార్థాల్లో.. వీటిని అడ్డుకునే సామర్థ్యమున్న వాటిని తాము గుర్తించామని దక్షిణ ఫ్లోరిడా ఆరోగ్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త యు చెన్ తెలిపారు. వీటిని కాల్ఫైయిన్ ఇన్హిబిటర్స్-2,12గా పిలుస్తున్నట్లు వివరించారు.