భద్రతా ప్రమాణాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేయటం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కొవిడ్ టీకాను విడుదల చేసినట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది డబ్ల్యూహెచ్ఓ.
కరోనాను కట్టడి చేసేందుకు మొట్టమొదటగా తామే టీకాను అభివృద్ధి చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. రష్యా వ్యాక్సిన్ భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉందన్న డబ్ల్యూహెచ్ఓ.. ఈ విషయమై ఆ దేశ ఆరోగ్య శాఖ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.