తెలంగాణ

telangana

ETV Bharat / international

సురక్షితమైన వాక్సిన్​కు ఔషధ సంస్థల ప్రతిజ్ఞ

వినియోగానికి ఆమోదం పొందే కరోనా వ్యాక్సిన్​పై ప్రజల్లో విశ్వాసం పెంచేలా.. టీకా తయారీలో ముందు వరుసలో ఉన్న ఔషధ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీకా పరీక్షలు, ఉత్పత్తిలో అత్యున్నత శాస్త్రీయ పద్ధతులు, నైతిక ప్రమాణాలను పాటించాలని ప్రతిజ్ఞ చేశాయి. ఇందులో ఫైజర్​, జాన్సన్​ &జాన్సన్​ సహ మొత్తం తొమ్మిది దిగ్గజ సంస్థలు ఉన్నాయి.

DRUG COMPANIES PLADE ON CORONA VACCINE SAFTY
కరోనా వ్యాక్సిన్ భద్రతపై ఔషధ సంస్థల ప్రతిజ్ఞ

By

Published : Sep 9, 2020, 5:35 AM IST

మానవాళికి తీవ్ర ముప్పుగా తయారైన కరోనా వైరస్​ను ఎదుర్కొనే వ్యాక్సిన్​ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా ఔషధ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా పరిశోధనలో ముందు వరుసలో ఉన్న తొమ్మిది ఔషధ తయారీ సంస్థలు వ్యాక్సిన్​ విషయంలో కీలక ప్రతిజ్ఞ చేశాయి.

వ్యాక్సిన్ పరీక్ష, ఉత్పత్తిలో అత్యున్నత శాస్త్రీయ పద్ధతులు, నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞలో పేర్కొన్నాయి ఆయా కంపెనీలు. టీకా వేసుకునే వారి శ్రేయస్సుకే తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపాయి.

వినియోగానికి అమోదం పొందే వ్యాక్సిన్​పై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి ఔషధ కంపెనీలు.

వ్యాక్సిన్​కు తుది ఆమోదంలో తెలిపే విషయంలో అమెరికా ఆహార, ఔషధ నింయంత్రణ సంస్థపై రాజకీయ ఒత్తిళ్లకు ఆస్కారం ఉందనే వార్తలు వస్తున్న తరుణంలో.. ఔషధ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ ప్రతిజ్ఞపై సంతకం చేసిన కంపెనీల్లో అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ జాన్సన్​&జాన్సన్, మెర్క్, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్, ఐరోపా కంపెనీలైన ఆస్ట్రాజెనెకా, బయోటెక్, గ్లాక్సోస్మిత్​క్లిన్, సనోఫీలు ఉన్నాయి. బయోటెక్, ఫైజర్​లు సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్న టీకా కూడా.. తుది దశ ట్రయల్స్​లో ఉన్న వ్యాక్సిన్​లలో ఒకటిగా ఉంది.

ఇదీ చూడండి:హ్యాండ్ శానిటైజర్​ ఇలా ఉంటేనే బెస్ట్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details