మోస్ట్ వాంటెడ్ మాదకద్రవ్యాల వ్యాపారి డైరో ఆంటోనియా ఉసుగా అలియాస్ ఒటోనియల్.. కొలంబియా భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అవినీతి అధికారుల అండతో దశాబ్ద కాలంగా రహస్యంగా తిరిగిన ఉసుగా ఎట్టకేలకు కొలంబియా సైన్యానికి చిక్కాడు. ఈ మేరకు రబ్బరు బూట్లు, సంకెళ్లు వేసిన ఉసుగా ఫొటోలను విడుదల చేశారు అధికారులు. ఉసుగా అరెస్ట్‌ను మూడు దశాబ్దాల క్రితం పాబ్లో ఎస్కోబార్‌ను పట్టుకోవడంతో పోల్చారు ఆ దేశ అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్.
రూ.37 కోట్ల లక్షల రివార్డు
ఒటోనియల్.. దట్టమైన అరణ్యాల గుండా మాదకద్రవ్యాల (కొకైన్) స్మగ్లింగ్ చేసే గల్ఫ్ క్లేన్ బృందానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఉత్తర అమెరికా, మధ్య అమెరికాలకు డ్రగ్స్‌ను తరలించేందుకు అనువైన ప్రధాన మార్గాలపై నియంత్రణ సాధించేందుకు హత్యలు చేసి.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒటోనియల్ను పట్టుకోవడానికి అమెరికా పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చాలాకాలం ఉంచింది. అతనిపై రూ.37కోట్ల 50 లక్షలు (50 మిలియన్ డాలర్లు) రివార్డు ప్రకటించింది అమెరికా.