తెలంగాణ

telangana

ETV Bharat / international

జలుబు నేర్పిన పాఠం.. కరోనాపై పోరుకు కీలకం! - జలుబు నేర్పిన పాఠం.. కరోనాపై పోరుకు కీలకం

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసే టీ-కణాలు.. కొవిడ్​లోని కొన్ని భాగాలను పసిగడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఫలితంగా మళ్లీ మళ్లీ దాడిచేసే వైరస్​లను ఎదుర్కోవడంలో టీ-సెల్స్​ దోహదపడతాయని అమెరికాలోని లా జొల్లా ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Cold experiences are key to the fight with the Coronavirus
జలుబు నేర్పిన పాఠం.. కరోనాపై పోరుకు కీలకం!

By

Published : Aug 6, 2020, 12:19 PM IST

సాధారణ జలుబు వైరస్‌ను గుర్తించి, రోగ నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసే టీ-సెల్స్‌... కరోనా వైరస్‌లోని కొన్ని భాగాలను కూడా గుర్తించ గలుగుతున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. సాధారణ జలుబు వైరస్‌లతో వాటి పోరాట అనుభవమే ఇందుకు దోహదపడుతున్నట్టు వెల్లడైంది. అమెరికాలోని లా జొల్లా ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు చేపట్టిన ఈ పరిశోధన వివరాలను 'జర్నల్‌ సైన్స్‌' అందించింది.

వ్యాక్సిన్​లను అలా రూపొందిస్తేనే..

రోగ నిరోధక వ్యవస్థ మెమోరీలో కీలకమైన టీ-సెల్స్‌... శరీరం అంతకుముందు ఎదుర్కొన్న వైరస్‌లను పసిగడతాయి. తద్వారా మళ్లీ మళ్లీ దాడిచేసే అలాంటి వైరస్‌లను ఎదుర్కోవడంలో అవి శరీరానికి సహాయపడతాయి. అయితే.. 'కొంతమందిలోని టీ-సెల్స్‌ కరోనా వైరస్‌లోని కొన్ని భాగాలను పరమాణు నిర్మాణాల వరకూ గుర్తిస్తున్నాయి. ఫలితంగా వారి రోగనిరోధక వ్యవస్థ ముందుగానే అప్రమత్తమవుతోంది. కొంతమందిలో కొవిడ్‌-19 లక్షణాలు తక్కువగా, మరికొంత మందిలో ఎక్కువగా ఉండటానికి ఇది కూడా కారణం కావచ్చు. టీ-కణాల శక్తి, స్పందన సామర్థ్యాన్ని బట్టి కూడా కరోనాపై శరీర ప్రతిస్పందన తీరు ఆధారపడి ఉంటోంది. ఇప్పుడు తయారవుతున్న వ్యాక్సిన్లను కరోనా వైరస్‌లోని మిగతా భాగాలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తే.. వాటి పనితీరు మరింత మెరుగ్గా ఉండే అవకాశముంది.' అని పరిశోధనకర్తలు డేనియెల్‌ విస్కోఫ్, అలెసాండ్రో సేత్‌లు తెలిపారు.

ఇదీ చదవండి:తుంపర్లే అని లైట్​ తీసుకోవద్దు.. అవే పెద్ద ముప్పు!

ABOUT THE AUTHOR

...view details