అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్. అధ్యక్ష బాధ్యతలను ఆయన విస్మరించారని విమర్శించారు. ట్రంప్ మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటే అవమానాలు, బెదిరింపులు, నిందలకు శ్వేతసౌధం నిలయమవుతుందని హెచ్చరించారు. అధ్యక్ష పదవి అంటే రోజుకు గంటల తరబడి టీవీ చూడడం, సామాజిక మాధ్యమాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడమే అని ట్రంప్ భావిస్తున్నారని మండిపడ్డారు క్లింటన్.
డెమొక్రటిక్ పార్జీ జాతీయ సదస్సు రెండో రోజున కేవలం ఐదు నిమిషాల పాటే ప్రసంగించారు క్లింటన్. జో బైడెన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష పదవి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగల నాయకుడని కొనియాడారు.