జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడంపై ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపారు.
బుష్ చూపిన ప్రేమ మర్చిపోలేను:ఒబామా
ప్రమాణస్వీకార కార్యక్రమం... రెండు శతాబ్దాల నుంచి జరుగుతోన్న శాంతియుత అధికార బిదిలీకి నిదర్శనం అని వీడియోలో పేర్కొన్నారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. పదవిలో ఉన్నప్పుడు తమతో ఏకీభవించని వ్యక్తుల మాటనూ వినేవాడినని అన్నారు. 2009 నుంచి 2017 వరకు అధ్యక్ష పదవిలో ఉన్న ఒబామా... తను ప్రమాణస్వీకారం చేసినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. బుష్ తనపై అమితమైన ప్రేమను చూపారని తెలిపారు.
"జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టడం నాకు గర్వంగా ఉంది. కమలా, బైడెన్ల విజయం కోరుతూ ముగ్గురు అధ్యక్షులు వచ్చారు. దేశాభివృద్ధి కోసం మీకు నిరంతరం సూచనలు ఇచ్చేందుకు మేం సిద్ధం."