అమెరికాను 'క్లౌడెట్టే' వాయుగుండం అతలాకుతలం చేస్తోంది. ఉష్ణమండల తుపాను అయిన క్లౌడెట్టే... ఆదివారం బలహీనపడి ఉష్ణమండల వాయుగుండంగా మారింది. అయితే మళ్లీ తుపానుగా బలపడి.. తూర్పు తీరాన్ని తాకుతుందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది.
క్లౌడెట్టే ధాటికి వివిధ ఘటనల్లో 13 మంది మృతి చెందారు. అలబామాలో భారీగా వీచిన గాలులతో ఓ ట్రక్కు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో వాహనంలో ఉన్న ఇద్దరు సైతం మరణించారు. అనేక మంది గాయపడ్డారు.